
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లను అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు ప్రచురించారనే తెలంగాణ బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మెటా ఇండియా హెడ్‌ను కూడా నిందితుడిగా చేర్చడం జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారి తీసింది.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వ్యక్తులు చేసిన పోస్టులకు మెటా సంస్థ ఎలా బాధ్యత వహిస్తుందనే అంశంపై తీవ్ర విమర్శలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుపై చర్యలు తీసుకుంది. ఆయనను తక్షణ ప్రభావంతో డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, అరవింద్ బాబు ఇప్పటికే అక్కడ రిపోర్ట్ చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!