
రాజకీయాలు

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆహార కల్తీని అరికట్టేందుకు H-FAST (హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్) ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు 6 ఆహార తయారీ, విక్రయ సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఆహార భద్రతా నిబంధనల అమలును పరిశీలించారు.
ఈ తనిఖీల సందర్భంగా ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురిని H-FAST అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రయోగశాల పరీక్షల కోసం ఆహార నమూనాలను సేకరించగా, అవసరమైన చోట్ల చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!