

ఇంట్లో భోజనం తయారు చేసుకునే ఖర్చు కూడా పెరుగుతోంది. క్రిసిల్ ఇంటెలిజెన్స్ పేర్కొన్న గణాంకాల ప్రకారం.. శాకాహార భోజనం తయారీ వ్యయం 4 శాతం పెరగ్గా, మాంసాహార భోజనం ఖర్చు 9 శాతం అధికమైంది. ఉల్లి, వంట నూనె, ఎల్‌పీజీ సిలిండర్, చికెన్ ధరలు పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. వాతావరణ పరిస్థితులు, సరఫరాలో అంతరాయాలు, పెరిగిన ఉత్పత్తి వ్యయాలు ఆహార ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇంట్లో తయారు చేసే థాలీ ఖర్చులను క్రిసిల్ ఇంటెలిజెన్స్ ‘రోటీ రైస్ రేట్’ ద్వారా పర్యవేక్షిస్తోంది.
ఉల్లి ధరల పెరుగుదలతో పాటు వంట నూనె, ఎల్‌పీజీ ధరలు కూడా కుటుంబాలపై అదనపు భారాన్ని మోపుతున్నాయి. మరోవైపు బ్రాయిలర్ చికెన్ ధరలు పెరగడంతో మాంసాహార భోజనం ఖర్చు మరింత పెరిగింది. అయితే బంగాళదుంప, టమాటా ధరలు తగ్గడం కొంత ఉపశమనం కల్పించింది. వాతావరణ మార్పులు, పంటల దిగుబడి, మార్కెట్‌కు సరఫరా వంటి అంశాలు రానున్న రోజుల్లో ఇంటి భోజన ఖర్చులపై ప్రభావం చూపే అవకాశముందని క్రిసిల్ విశ్లేషణలు సూచిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!