

కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే కీలక ఆఫర్ ఇచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (A)లో చేరాలని ఆయన దీప్కేను ఆహ్వానించారు. దీప్కే చురుకైన యువ అంబేడ్కర్‌వాది అని పేర్కొన్న అథవాలే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆర్‌పీఐ (A)లో చేరాలని సూచించారు.
విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వ పాఠశాలల అంశాలపై CJP చేపడుతున్న కార్యక్రమాలతో అభిజీత్ దీప్కే ఇటీవల ప్రజల్లో ఎక్కువగా చర్చనీయాంశంగా మారారు. అయితే, గతంలో ప్రభుత్వంపై పలు అంశాల్లో విమర్శలు చేసిన దీప్కేకు ఇప్పుడు ఎన్డీయే భాగస్వామ్య పార్టీ నుంచి ఆహ్వానం రావడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఆఫర్‌పై స్పందించిన దీప్కే. గతంలో తనను ‘దేశ వ్యతిరేకి’గా ముద్ర వేసిన వారు ఇప్పుడు తనను తమ పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!