
సినిమాలు

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం తీరంలో అరుదైన, విలువైన ఖనిజం మొనజైట్ భారీగా ఉన్నట్లు గుర్తించారు. బీచ్ శాండ్ నిల్వల్లో సుమారు 27 కిలోమీటర్ల పొడవు, 700 మీటర్ల వెడల్పున ఖనిజ సంపద విస్తరించి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మొనజైట్‌తో పాటు గార్నెట్, ఇల్మనైట్, జిర్కాన్ వంటి ఖనిజాలు కూడా ఈ ప్రాంతంలో లభిస్తున్నాయి.
కళింగపట్నం తీరంలోని ప్రతి వెయ్యి కిలోల ఇసుకలో సుమారు ఐదు కిలోల స్వచ్ఛమైన మొనజైట్ ఉన్నట్లు వెల్లడైంది. సెమీకండక్టర్లు, ఎల్‌ఈడీలు, మైక్రోప్రాసెసర్లు, సోలార్ సెల్స్, లేజర్ పరికరాల తయారీలో మొనజైట్ కీలకంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం రేర్ ఎర్త్ ఖనిజాల కోసం భారత్ ఎక్కువగా చైనాపై ఆధారపడుతుండగా, దేశీయ వనరులను అభివృద్ధి చేసేందుకు కేంద్రం వ్యూహాత్మక చర్యలు చేపడుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!