

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పరకాల నియోజకవర్గాన్ని ఉద్దేశిస్తూ ‘అప్‌కమింగ్ ఎమ్మెల్యే’ అంటూ ఆమె పేర్కొనడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి పరకాల పర్యటన సందర్భంగా వచ్చే ఎన్నికల్లోనూ రేవూరి ప్రకాశ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సుస్మిత పోస్టుపై చర్చ మొదలైంది.

మరోవైపు మంత్రి కొండా సురేఖ జన్మదినాన్ని పురస్కరించుకుని పరకాల నియోజకవర్గంలో ప్రత్యేక వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుస్మిత చేసిన పోస్టు రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని పెంచింది. అయితే ఆమె భవిష్యత్ రాజకీయ ప్రవేశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ పోస్టు వెనుక రాజకీయ ఉద్దేశం ఉందా, లేక సాధారణ వ్యాఖ్య మాత్రమేనా అనే చర్చ కొనసాగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!