
ఓటీటీ

రుక్మిణీ వసంత్ సప్త సాగరాలు దాటి, కాంతార: చాప్టర్ 1 వంటి చిత్రాలతో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో టాక్సిక్, డ్రాగన్ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. దక్షిణాది ప్రేక్షకులతో పాటు ఉత్తరాదిలోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న రుక్మిణీ వసంత్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన తెలుగు ప్రాజెక్టుతో వార్తల్లో నిలుస్తున్నారు.
హీరో నాని సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా పతాకంపై రూపొందనున్న కొత్త చిత్రంలో కథానాయికగా ఆమెను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశమున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ప్రధాన కథానాయకుడు ఖరారైన తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!