
రాజకీయాలు

నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలువురు ప్రముఖ నటుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ తనకు ఎంతో ఇష్టమని, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిపై కూడా అపారమైన అభిమానం పెరిగిందని చెప్పారు. చిరంజీవి లెజెండరీ నటుడిగా ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారని కొనియాడారు.
అలాగే రాజేంద్రప్రసాద్ నటనపై ప్రశంసలు కురిపించిన పోసాని, ఆయన క్షణాల్లోనే కామెడీ నుంచి ఎమోషనల్ సన్నివేశాలకు అద్భుతంగా మారగల అరుదైన నటుడని అన్నారు. ఎవరైనా కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్‌లో గొప్ప నటుడు ఎవరు అని అడిగితే తాను రాజేంద్రప్రసాద్ పేరే చెబుతానని పేర్కొన్నారు. ఎలాంటి రిహార్సల్స్ లేకుండానే ఏ సన్నివేశాన్నైనా సహజంగా చేయగల గొప్ప నటుడు రాజేంద్రప్రసాద్ అని ఆయన అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!