
జనరల్

సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ థియేటర్లలో ఘన విజయాన్ని సాధించింది. మహిళా ప్రధాన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. భావోద్వేగభరితమైన కథ, సమంత అద్భుత నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
ఇటీవల ఈ చిత్రం జియోహాట్‌స్టార్ వేదికగా హిందీ మినహా ఇతర భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఓటిటిలో విడుదలైన తర్వాత కూడా చిత్రానికి అద్భుతమైన ఆదరణ లభిస్తున్నట్లు స్ట్రీమింగ్ సంస్థ వెల్లడించింది. భారీ వ్యూయర్‌షిప్‌తో కొత్త రికార్డులు నమోదు చేస్తూ థియేటర్ల తర్వాత ఓటిటిలోనూ విజయయాత్ర కొనసాగిస్తోంది. దీంతో సమంత కెరీర్‌లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!