
క్రీడలు

‘సామజవరగమన’ బ్లాక్‌బస్టర్ విజయానంతరం హీరో శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ, ఇందులో కథానాయిక ఎవరనే విషయాన్ని చిత్ర బృందం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు.
తాజాగా ఈ సినిమాలో సాక్షి మడోల్కర్ కథానాయికగా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రోషన్ హీరోగా సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘మోగ్లీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాక్షి, ఇప్పుడు శ్రీ విష్ణుతో జతకట్టే అవకాశం దక్కించుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భాను బోగవరపు, నందు సావిరిగణ కథ, మాటలు అందిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!