

విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ను రూ.110 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించినట్లు నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి తెలిపారు. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో ఈ భారీ ప్రాజెక్ట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దామని, ఇది ఒక విజువల్ ఫీస్ట్‌గా ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ అనుభవాన్ని అందిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ చిత్రంలో నభ నతేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్లతో భారీ హైప్ క్రియేట్ చేసింది. ప్రతి 10 నిమిషాలకు ఒక విజువల్ ఎలిమెంట్ కనిపిస్తుందని, భారీ సెట్లు, అద్భుతమైన గ్రాఫిక్స్‌తో సినిమా రూపొందించామని నిర్మాతలు తెలిపారు. ఆధ్యాత్మికత, శివ భక్తి తమ జీవితాల్లో భాగమని, అదే భావన ఈ చిత్ర నిర్మాణంలో ప్రతిబింబించిందని వారు చెప్పారు. సినిమా విజయం సాధిస్తే సీక్వెల్ కూడా చేసే ఆలోచన ఉందని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!