
సినిమాలు

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘ఓమ్’ నుంచి మరో భారీ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. నసీరుద్దీన్ షాకు స్వాగతం పలుకుతూ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామితో కలిసి దిగిన ఫొటోలను మేకర్స్ విడుదల చేశారు. ధనుష్ కెరీర్‌లో 55వ చిత్రంగా రూపొందుతున్న ‘ఓమ్’ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!