
గాసిప్స్

యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, విద్యాబాలన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ పూర్తైన సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్టు చేశారు. ప్రతి సినిమా షెడ్యూల్ జీవితంలో కొత్త పాఠాలు నేర్పుతుందని, మన చుట్టూ ఉన్న మనుషుల ప్రేమే అసలైన బలమని ఆమె పేర్కొన్నారు.
షూటింగ్ సమయంలో అనారోగ్యానికి గురయ్యానని, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో గాయాలూ అయ్యాయని రాశీ ఖన్నా వెల్లడించారు. అయినప్పటికీ కుటుంబ సభ్యులు, మేనల్లుడు, చిత్రబృందం ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ కష్టాలను అధిగమించి షూటింగ్ పూర్తి చేశానని తెలిపారు. ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత అలసట కంటే అందరి ప్రేమ, ఆదరణ మాత్రమే తన మనసులో మిగిలిపోయిందని ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!