

రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి CBFC ‘A’ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. కొన్ని డైలాగ్‌లలో మార్పులు, మద్యం, ధూమపానానికి సంబంధించిన డిస్‌క్లైమర్లు చేర్చినప్పటికీ, ఎలాంటి కట్స్ లేకుండా సినిమాకు అనుమతి లభించినట్లు తెలుస్తోంది.
పీరియాడిక్ నేపథ్యంలో గోవాలో సాగే ఈ కథలో పవర్ పాలిటిక్స్, వెన్నుపోట్లు, డ్రగ్స్, మాఫియా వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి. యష్ రాయ, రుమీ అనే రెండు పాత్రల్లో కనిపించనున్నారు. నయనతార గంగ పాత్రలో, కియారా అద్వానీ నాడియా పాత్రలో నటించారు. రాయ ఎదుర్కొనే పరిస్థితులు, అతని ప్రేమ ప్రయాణం, గంగతో ఉన్న విభేదాలు, ఇతర కీలక పాత్రల చుట్టూ కథ సాగుతుంది.
సెన్సార్ సర్టిఫికెట్ ప్రకారం ‘టాక్సిక్’ రన్‌టైమ్ 3 గంటల 14 నిమిషాలు, అంటే 194 నిమిషాలు. సినిమా కథ, కథనం, నటీనటుల పెర్ఫార్మెన్స్‌పై సెన్సార్ బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కియారా అద్వానీతో యష్ రొమాంటిక్ సన్నివేశాలు, నయనతారతో భావోద్వేగ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టాక్. హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ పాత్రలు కూడా సినిమాకు కీలకంగా ఉండనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!