
జనరల్

స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు. వయసు పెరిగినా కూడా ఆమెకు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల గోవాలో జరిగిన ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ పెద్ద కుమార్తె అవంతిక వివాహ వేడుకలో త్రిష పాల్గొనడంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు.
ఈ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రిష సాంప్రదాయ చీరలో, పచ్చరత్నాల హారంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిరంజీవి పక్కన కూర్చొని ఆయనతో సరదాగా మాట్లాడుతున్న త్రిష ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నూతన వధూవరులను ఆశీర్వదించిన త్రిష తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!