

వెబ్ సిరీస్ ‘ఆహా కళ్యాణం’లో ‘పవి టీచర్’ పాత్రతో కుర్రాళ్ల హృదయాలను గెలుచుకున్న నటి బ్రిగిడా సాగ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్‌ను ప్రారంభించిన ఆమె.. సహజమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం కోలీవుడ్‌లోకి అడుగుపెట్టి పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో నటించారు. వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచే బ్రిగిడా.. గత జూలైలో తన ప్రేమ విషయాన్ని వెల్లడించి, నటుడు, దర్శకుడు ఆనంద్ రామ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు.
కొంతకాలంగా ప్రేమలో ఉన్న బ్రిగిడా, ఆనంద్ రామ్ తాజాగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఆనంద్ రామ్ ‘మీసైయ మురుకు’ చిత్రంలో నటించడంతో పాటు ‘నన్బన్ ఒరువన్ వంద పిరగు’ చిత్రానికి దర్శకత్వం వహించారు. వివాహానికి సంబంధించిన అందమైన ఫొటోలను బ్రిగిడా సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైరల్‌గా మారాయి. నూతన దంపతులకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!