

వరుస విజయాలతో జోష్‌లో ఉన్న చార్మింగ్ స్టార్ శర్వానంద్.. ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్లతో కలిసి ఓ పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంలో నటించనున్నారు. ప్రస్తుతం ‘జార్జ్‌క్రిష్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. శర్వానంద్‌కు జోడీగా యువ నటి భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆమె పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది.
మరోవైపు కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటి రవీనా టాండన్‌ను చిత్రబృందం సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె సినిమాలో శక్తివంతమైన పోలీస్ అధికారిణి పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కథలో ఈ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, సినిమా కథనానికి ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. శ్రీనువైట్ల మార్క్ కామెడీ, యాక్షన్‌కు శర్వానంద్, భాగ్యశ్రీ బోర్సే, రవీనా టాండన్ కలయిక తోడైతే సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే నటీనటుల ఎంపికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!