

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక పాత ఫొటోపై సోషల్ మీడియాలో స్పందిస్తూ, తెలంగాణ ఉద్యమం మరియు “సామాజిక తెలంగాణ” భావన చుట్టూ జరిగిన చర్చలను గుర్తు చేసుకున్నారు. బహుజన ఆలోచన, సామాజిక న్యాయం, రాజకీయంగా వెనుకబడిన వర్గాల సాధికారత వంటి అంశాలు ఆ రోజుల్లో తమ చర్చల్లో ప్రధానంగా ఉండేవని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ మేధావులు, బహుజన ఉద్యమకారుడు ఆగస్టిన్, ప్రజా గాయకుడు గద్దర్ తదితరులతో కలిసి తెలంగాణ భవిష్యత్తుపై అనేకసార్లు చర్చించామని తెలిపారు.
ఈ ఫొటో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావానికి ముందు కాలానికి చెందినదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తన తండ్రి కొణిదెల వెంకటరావు మరణం అనంతరం ఆగస్టిన్, గద్దర్ తమ ఇంటికి వచ్చిన సందర్భంలో ఈ ఫొటో తీసినట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా, సామాజిక మార్పు, సమానత్వం, సామాజిక న్యాయాన్ని రాజకీయ శక్తిగా మలచాలనే ఆకాంక్షలతో నిండిన ఆ రోజులు తనకు మధుర జ్ఞాపకాలుగా నిలిచాయని పవన్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!