
బిజినెస్

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న జార్జ్ కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(2) ప్రకారం, ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
రాజీనామా వెంటనే అమల్లోకి వచ్చినట్లు రాష్ట్రపతి భవన్ పేర్కొంది. ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో ఒక ఖాళీ ఉన్న నేపథ్యంలో, జార్జ్ కురియన్ వైదొలగడంతో మరో ఖాళీ ఏర్పడింది. ఈ పరిణామం కేంద్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!