

బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో 11వ ఎపిసోడ్ పలు ఆసక్తికరమైన ట్విస్టులు, టాస్కులతో సాగింది. లీడర్ అయ్యేందుకు ఎవరు అర్హులు కాదో గుర్తించే టాస్క్‌తో ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇందులో బాల్‌ను పట్టుకున్న కంటెస్టెంట్ ఇద్దరి పేర్లు చెప్పి.. వారు లీడర్‌గా ఎందుకు అనర్హులో కారణాలు వివరించాల్సి వచ్చింది.
మొదట మిథిలేష్ బాల్ పట్టుకుని రాజకుమారి, అపూర్వ పేర్లు చెప్పాడు. అనంతరం రెండో రౌండ్‌కు వెళ్లే సమయంలో భాగీ గాయపడటంతో ఆమెను వైద్య పరీక్షల కోసం బయటకు పంపించారు. ఆ తర్వాత దీపక్ హేమంత్, గాయత్రి పేర్లు చెప్పగా.. రామకృష్ణ రోహిత్, చరణ్‌లను అనర్హులుగా పేర్కొన్నాడు. నాలుగో రౌండ్‌లో బాల్ పట్టుకున్న షాలినీ.. రామకృష్ణ, ఝాన్సీ పేర్లను చెప్పింది. చివరి రౌండ్‌లో ప్రియాంక అమన్, మిథిలేష్‌లను ఎంపిక చేసింది. దీంతో షాలినీ, ప్రియాంక, శ్రష్టి, దీపక్ తదుపరి స్థాయికి చేరుకున్నారు.
ఈ క్రమంలో ఎస్‌కేఎన్ ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్లకు మరో టాస్క్ ఇచ్చారు. అనంతరం గ్లాస్‌లోని నీటిని కాపాడుకునే టాస్క్ ద్వారా షాలినీ, ప్రియాంక లీడర్లుగా ఎంపికయ్యారు. జ్యూరీ సూచనల మేరకు కంటెస్టెంట్లను రెండు టీమ్‌లుగా విభజించారు. షాలినీ టీమ్‌లో రాజకుమారి, శ్రష్టి, అపూర్వ, రోహిత్, చరణ్, అమన్ చేరగా.. ప్రియాంక టీమ్‌లో హేమంత్, రామకృష్ణ, ఝాన్సీ, గాయత్రి, మిథిలేష్, దీపక్ ఉన్నారు.
ఇక అమన్ గెలుచుకున్న Swap the Leaders కార్డును బిందు మాధవి షాలినీకి ఇచ్చింది. ఆ కార్డును ఉపయోగించిన షాలినీ.. ప్రియాంకను లీడర్ పదవి నుంచి తొలగించి ఝాన్సీని లీడర్‌గా ఎంపిక చేసింది. ఆ తర్వాత రెండు టీమ్‌లకు 90 డిగ్రీల యాంగిల్‌లో చేతిని ఉంచి, మోచేతిని వంచకుండా ఎక్కువసేపు నిలబెట్టే టాస్క్ ఇచ్చారు.
ఈ టాస్క్‌లో షాలినీ టీమ్ తరఫున చరణ్ చివరి వరకు పోరాడగా.. ఝాన్సీ టీమ్ తరఫున మిథిలేష్, హేమంత్ అద్భుతంగా నిలిచారు. చివరకు చరణ్ చేతులు ఎత్తేయడంతో ఝాన్సీ టీమ్ విజయం సాధించింది. దీంతో తన టీమ్‌లో అత్యుత్తమంగా ఆడిన హేమంత్‌కు ఝాన్సీ ఓట్ అప్పీల్ అవకాశం ఇచ్చింది. మరోవైపు షాలినీ వ్యూహాలు, వాదించే తీరు, తనను తాను డిఫెండ్ చేసుకునే విధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఆమెకు కూడా ఓట్ అప్పీల్ అవకాశం లభించింది. ఆటలో రూల్స్ మర్చిపోయిన రామకృష్ణకు ఎల్లో కార్డ్ ఇవ్వడంతో 11వ ఎపిసోడ్ ముగిసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!