
జనరల్

భారత క్రికెటర్ రింకూ సింగ్ తన జీవితంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర స్థాయి క్రికెట్‌లో ఆడేటప్పుడు రంజీ మ్యాచ్‌లకు లక్ష రూపాయలు, ఒకరోజు మ్యాచ్‌లకు 35 వేల రూపాయలు, ఇరవై ఓవర్ల మ్యాచ్‌లకు 17 వేల రూపాయలు అందేవని తెలిపారు. కుటుంబంపై ఉన్న రూ.2.5 నుంచి 3 లక్షల అప్పులను తీర్చడమే తన మొదటి లక్ష్యమని చెప్పారు.
2017లో పంజాబ్ జట్టుతో రూ.10 లక్షల ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత కుటుంబ అప్పులన్నీ తీర్చగలిగానని రింకూ వెల్లడించారు. అనంతరం రూ.80 లక్షల ఒప్పందం కుదిరినప్పుడు తన జీవితంలో అంత పెద్ద మొత్తాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. చిన్నప్పుడు తండ్రి ఇచ్చే ఒక్క రూపాయి కూడా ఎంతో విలువైనదని, ఇప్పుడు ఇల్లు నిర్మించి కుటుంబానికి మంచి జీవితం అందించగలిగానని ఆయన తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!