

టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ పొందుతున్న సమయంలో అతడి తొడ కండరాలకు గాయం కావడంతో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. వైద్యుల అంచనాల ప్రకారం పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరికొంత సమయం అవసరమని తెలుస్తోంది. దీంతో ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్‌లో అతడు ఆడే అవకాశం లేకుండా పోయింది.
అంతేకాకుండా ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో జరిగే టీ20 సిరీస్‌లు, సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా క్రీడల జట్టులో కూడా హార్దిక్‌కు చోటు దక్కలేదు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతడి వర్క్‌లోడ్‌ను జాగ్రత్తగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బౌలింగ్‌కు పూర్తిగా ఫిట్‌గా లేని హార్దిక్, శుభ్‌మన్ గిల్ సారథ్యంలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!