

మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు ఘన నివాళులర్పించారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో రాజీవ్ గాంధీ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యం, ఐక్యతను పెంపొందించాలనే సందేశంతో నిర్వహించే సద్భావనా దినోత్సవం ప్రజలందరికీ గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమాజంలో పరస్పర గౌరవం, సామరస్యం, ఐక్యత మరింత బలపడాల్సిన అవసరం ఉందని అన్నారు.
“సమైక్యతే మన శక్తి – సద్భావనే మన ప్రగతి” అనే స్ఫూర్తితో రాజీవ్ గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శాంతి, సౌభ్రాతృత్వం, సమానత్వంతో కూడిన బలమైన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. ప్రజల మధ్య ఐక్యత, మత సామరస్యం, పరస్పర గౌరవం వంటి విలువలను కాపాడుతూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!