

గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన వల్లూరి అజయ్ బాబు అద్భుత ప్రదర్శనతో పురుషుల 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. స్నాచ్‌లో 149 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 181 కిలోలు ఎత్తి మొత్తం 330 కిలోలతో రెండో స్థానంలో నిలిచాడు. మలేసియాకు చెందిన హిదాయత్ మహమ్మద్ ఒక్క కిలో అధికంగా ఎత్తి స్వర్ణం సాధించగా, ఇంగ్లాండ్‌కు చెందిన క్రిస్ ముర్రే 325 కిలోలతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.

ఈ విజయం అజయ్ కుటుంబానికి ప్రత్యేకమైన ఘనతను తీసుకొచ్చింది. ఆయన తండ్రి వల్లూరి శ్రీనివాసరావు 2010 ఢిల్లీ కామన్‌వెల్త్ గేమ్స్‌లో 56 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి దేశానికి కీర్తి తీసుకొచ్చారు. ఇప్పుడు అదే కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ అజయ్ బాబు కామన్‌వెల్త్ వేదికపై రజత పతకం గెలిచి భారత్‌కు వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆరో పతకాన్ని అందించాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!