

కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన అనంతరం పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆయన సతీమణి అన్నా కొణిదెల కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న పవన్ కల్యాణ్, దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
వేడుకల్లో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించే శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, దేవాదాయ, నీటిపారుదల, విద్య, వ్యవసాయ శాఖలకు సంబంధించిన శకటాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల శాస్త్ర, సాంకేతిక ప్రదర్శనలు, రోబో నమస్కారం, పోలీసు జాగిలాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!