
సినిమాలు

పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో సెలబ్రిటీలు వరుసగా శుభకార్యాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్ శర్మిలా మాండ్రే తమిళ నిర్మాత సుధాన్ సుందరంతో సింపుల్‌గా నిశ్చితార్థం చేసుకుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కన్నడ పరిశ్రమకు చెందిన శర్మిలా మాండ్రే 2007 నుంచి దక్షిణాది సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో అల్లరి నరేశ్ నటించిన కెవ్వు కేక (2013) చిత్రంలో కనిపించింది. తమిళంలో హీరోయిన్‌గా, నిర్మాతగానూ పలు సినిమాలు చేసింది. ఆమె ఫియాన్సీ సుధాన్ సుందరం విజయ్ సేతుపతి నటించిన మహారాజా వంటి సినిమాలను నిర్మించాడు. ఈ ఏడాదిలోనే వీరి పెళ్లి జరగొచ్చని సమాచారం.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!