

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తన కెరీర్ ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలను తాజాగా ‘కౌన్ బనేగా కరోడ్పతి’ కార్యక్రమంలో గుర్తుచేసుకున్నారు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తన ఎత్తు ఎక్కువగా ఉందనే కారణంతో పలువురు తిరస్కరించారని తెలిపారు. ఒక దశలో తనను ఇంటికి వెళ్లిపోవాలని కూడా కొందరు నిరుత్సాహపరిచారని అమితాబ్ వెల్లడించారు.
మరో సందర్భంలో సినిమా షూటింగ్కు కొంత ఆలస్యంగా వెళ్లడంతో దర్శకుడు తనపై ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోమని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు, తిరస్కరణలు ఎదురైనా ఆయన పట్టుదలతో ముందుకు సాగారు. అనంతరం వరుస విజయాలతో బాలీవుడ్లో స్టార్ హీరోగా ఎదిగి, బిగ్ బి అనే ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం కూడా వరుస చిత్రాలతో తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!