

‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్‌కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణకు ఆన్‌లైన్‌లో హాజరయ్యేందుకు చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం అంగీకరించకపోవడంతో ఆయన స్వయంగా కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. సంధ్య థియేటర్ ఘటనపై దాఖలైన కేసులో తాజా చార్జిషీట్‌లో అల్లు అర్జున్ పేరును 11వ నిందితుడిగా నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్న నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. తొలి హాజరు తప్పనిసరిగా ప్రత్యక్షంగానే ఉండాలని స్పష్టం చేసిన న్యాయస్థానం, వర్చువల్ హాజరుకు అనుమతి ఇవ్వలేదు.
భద్రతా అంశాలను ప్రస్తావిస్తూ ఆన్‌లైన్ ద్వారా విచారణలో పాల్గొనే అవకాశం కల్పించాలని న్యాయవాదులు కోరినా, కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించినట్లు సమాచారం. దీంతో సోమవారం అల్లు అర్జున్ నేరుగా కోర్టుకు హాజరుకానున్నారు.ఇక ఆయన రాక సందర్భంగా అభిమానుల భారీ రద్దీ ఏర్పడే అవకాశాలు ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు పరిసరాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించడంతో పాటు ట్రాఫిక్, శాంతిభద్రతల పరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తదుపరి పరిణామాలపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!