

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, దాదాపు రూ.4,000 కోట్ల వ్యయంతో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులకు చేరువ చేయాలనే లక్ష్యంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. అమెరికాలోని ఐమాక్స్ థియేటర్లలో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనల్లో ట్రైలర్ చూసిన ప్రేక్షకులు విజువల్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు సాయి పల్లవి పోషిస్తున్న సీత పాత్రను ప్రశంసించారు.
ప్రీ రిలీజ్ బిజినెస్ ఆశించిన స్థాయిలో సాగలేదనే ప్రచారం మధ్య, గ్లోబల్ మార్కెట్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి సారించారు. ‘ప్రథమ్ సంకల్ప్’ పేరుతో ఢిల్లీలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించగా, దేశవ్యాప్తంగా 500కు పైగా పాఠశాలల్లో ‘రామాయణ స్కూల్ ప్రోగ్రామ్స్’ నిర్వహిస్తూ భారతీయ సంస్కృతిని ప్రచారంలో భాగం చేస్తున్నారు. ట్రైలర్లు, పోస్టర్లకే పరిమితం కాకుండా ఈ సినిమాను ఒక సాంస్కృతిక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు విడుదల కానున్న ట్రైలర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!