
సినిమాలు

టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకుల్లో ‘పందెంకోడి’తో మంచి గుర్తింపు పొందిన యాక్షన్ హీరో విశాల్, ఇప్పుడు దర్శకుడిగా కొత్త ప్రయాణం ప్రారంభించారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ 99వ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మకుటం’తో ఆయన దర్శకుడిగా, నటుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
ఇప్పటికే టీజర్, మొదటి పాట ‘ది రైజ్ ఆఫ్ లింగా’ మంచి స్పందన పొందగా, తాజాగా ‘నచ్చాకే వచ్చేరా’ అనే రెండో సింగిల్‌ను హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా విశాల్ భావోద్వేగానికి లోనై మాట్లాడుతూ, ‘శివ’ సినిమా చూసినప్పుడే దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఆర్‌బీ చౌదరి గారి సహకారం, తన తండ్రి జీకే రెడ్డి ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!