
జనరల్

టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కుమార్తె స్నిగ్ధ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, 'కాక్రోచ్ జనతా పార్టీ' ఆందోళనకు మద్దతు తెలుపుతున్నట్లుగా చేసిన పోస్టులు విస్తృతంగా వైరల్ అయ్యాయి. అలాగే కేంద్ర మంత్రికి రాజీనామా లేఖ తయారు చేయాలా అంటూ వ్యంగ్య వ్యాఖ్య చేసిన పోస్టు కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
టీడీపీ ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటంతో ఈ పోస్టులు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ పరిణామంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, టీడీపీ వైఖరిపై బీజేపీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ అంశంపై టీడీపీ లేదా బీజేపీ నుంచి అధికారిక స్పందన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!