

లండన్‌లోని చారిత్రక లార్డ్స్ క్రికెట్ మైదానం తారల వెలుగులతో మెరిసిపోతోంది. భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ నిర్ణయాత్మక ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, రిషబ్ పంత్ తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు, క్రికెట్ దిగ్గజాలు హాజరయ్యారు. దీంతో మైదానంలో పండుగ వాతావరణం నెలకొంది.
భార్య సాక్షితో కలిసి మ్యాచ్ చూస్తున్న ధోనీ, ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, నటి కృతి సనన్‌లతో కలిసి కనిపించారు. ఇంగ్లండ్ పర్యటనలో ధోనీ ఒక మ్యాచ్‌కు హాజరు కావడం ఇది మూడోసారి. ఇంతకుముందు తన పుట్టినరోజున ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌ను, ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి వన్డేను కూడా ఆయన వీక్షించారు.
ఈ మ్యాచ్‌లో మరో అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత దిగ్గజం సునీల్ గవాస్కర్, వెస్టిండీస్ లెజెండ్స్ బ్రియాన్ లారా, సర్ క్లైవ్ లాయిడ్, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర, భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులను అలరించారు. అంతకుముందు యువరాజ్ సింగ్ ఐదు నిమిషాల గంటను మోగించి ఆటను ప్రారంభించడం విశేషం. వీరితో పాటు రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే కూడా స్టాండ్స్‌లో కనిపించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!