

ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఉత్తరాంధ్ర విమానయాన రంగానికి ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు. 2,203 ఎకరాల్లో రూ.4,592 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయంలో 3,800 మీటర్ల కోడ్-ఈ రన్‌వే, కార్గో టెర్మినల్, ఆధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలు, సౌర విద్యుత్ మౌలిక సదుపాయాలు, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు.
తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో రూపొందిన ఈ విమానాశ్రయాన్ని భవిష్యత్తులో 4 కోట్ల మంది ప్రయాణికులను నిర్వహించే స్థాయికి విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రలో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, లాజిస్టిక్స్ రంగాలకు ఇది కీలక ద్వారంగా మారి ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!