
సినిమాలు

బీఆర్ఎస్ నేతల బృందం నేడు న్యూఢిల్లీలో సాయంత్రం 4:30 గంటలకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను కలవనుంది. ఈ బృందంలో ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి, మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన పలు సూచనలను ఎన్నికల సంఘానికి అందజేయడంతో పాటు దేశవ్యాప్తంగా "ఒక వ్యక్తికి ఒకే ఓటు" విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరనున్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయతను మరింత బలోపేతం చేసే అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!