
జనరల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమానాశ్రయాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని ఎయిర్‌పోర్ట్‌లలో బార్‌లు, వైన్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తిరుపతి విమానాశ్రయాన్ని ఈ నిబంధనల నుంచి మినహాయించారు.
ఈ నిర్ణయం రాష్ట్రంలోని మిగతా అన్ని విమానాశ్రయాలకు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. కొత్త విధానం ద్వారా ఎయిర్‌పోర్ట్ సేవల్లో మరింత సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!