
జనరల్

భూపాలపల్లి జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) వెంకన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రవాణా శాఖ కార్యాలయం సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో టిప్పర్ లారీ ఢీకొనడంతో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని మంత్రి ఆదేశించారు. వెంకన్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇదే ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్‌ను పూర్తి స్థాయి విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని సీఎం పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!