

తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) చీఫ్ కవిత గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అధికారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా, వారి వెనుక ఉండి ప్రోత్సహించిన రాజకీయ పెద్దలెవరో కూడా బయటపెట్టాలని ప్రశ్నించారు. అధికారులను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడిన వారి నుంచి అవినీతి సొమ్మును ఎవరు రికవరీ చేస్తారని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె నిలదీశారు.
ప్రస్తుత ప్రభుత్వంలోనూ అవినీతికి పాల్పడుతున్న వారి వ్యవహారాలను వెలుగులోకి తెచ్చేవారు లేరా అని కవిత ప్రశ్నించారు. అధికారులను మాత్రమే బాధ్యులను చేయకుండా, వారి ద్వారా వ్యవస్థలను దోపిడీ చేస్తున్న వారిని కూడా కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు నమ్మి అప్పగించిన అధికారాన్ని ఉపయోగించి భవిష్యత్ తరాలకు చెందాల్సిన సంపదను కొల్లగొట్టేవారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!