

పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ నిర్బంధంపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు ఆందోళన వ్యక్తం చేశారు. మానవతా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇమ్రాన్ ఖాన్ నిర్బంధంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పందించాలని కోరుతూ విదేశాంగ మంత్రి సెనేటర్ పెన్నీ వాంగ్‌కు ఏడుగురు మాజీ కెప్టెన్లు సంయుక్తంగా లేఖ రాశారు. ఈ లేఖపై అలన్ బోర్డర్, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, కిమ్ హ్యూస్, మార్క్ టేలర్, స్టీవ్ వా సంతకాలు చేశారు.
తాము దౌత్యవేత్తలుగా లేదా రాజకీయ నాయకులుగా ఈ లేఖ రాయడం లేదని, మాజీ క్రికెట్ కెప్టెన్లుగా ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై స్పందించాల్సిన బాధ్యతగా భావించి ఈ విజ్ఞప్తి చేస్తున్నామని వారు పేర్కొన్నారు. క్రికెట్ ప్రపంచంలో ఇమ్రాన్ ఖాన్‌తో ఉన్న అనుబంధం, ఆయన ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఈ అంశాన్ని పరిశీలించాలని వారు కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!