

హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనదారులకు ఇకపై తప్పించుకునే అవకాశం ఉండదని ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లోని అప్లైడ్ ఏఐ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు చెబుతున్నారు. వారు అభివృద్ధి చేసిన ‘డ్యాష్‌కామ్’ కెమెరా కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో పనిచేస్తుంది. ట్రాఫిక్ పోలీసుల వాహనాల్లో అమర్చిన ఈ కెమెరా రోడ్లపై తిరుగుతూ నిబంధనలు ఉల్లంఘించే వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తించి రికార్డు చేస్తుంది. ఈ వివరాలను ట్రాఫిక్ పోలీసులు, రవాణాశాఖ డేటాబేస్‌తో అనుసంధానం చేస్తే వెంటనే చలానా వ్యవస్థకు సమాచారం చేరుతుంది.
డ్యాష్‌కామ్ పనితీరును పరీక్షించేందుకు హైదరాబాద్‌లోని నాలుగు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని నాలుగు ఇన్నోవా వాహనాల్లో కెమెరాలను ఏర్పాటు చేసి ఆరు నెలల పాటు పరిశీలించారు. రూ.8-10 వేల వ్యయంతో రూపొందించిన ఈ కెమెరా ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు ద్విచక్ర వాహనాలకు కూడా మూడు కెమెరాలను ఏర్పాటు చేసి ఉల్లంఘనలను గుర్తించే ప్రయోగాలు కొనసాగుతున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!