

భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పుకు దారితీసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవలు అంతర్జాతీయంగా మరింత విస్తరిస్తున్నాయి. తాజాగా గ్రీస్‌లోని ఏథెన్స్లో యూపీఐ సేవలను అధికారికంగా ప్రారంభించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గ్రీస్ పర్యటన సందర్భంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. యూరోబ్యాంక్, ఎన్ఐపీఎల్ భాగస్వామ్యంతో ఈ సేవలు ప్రారంభమయ్యాయి.
ఈ కొత్త సేవలతో అర్హత కలిగిన భారతీయ వినియోగదారులు గ్రీస్‌లో వేగవంతంగా, సురక్షితంగా, తక్కువ ఖర్చుతో డిజిటల్ చెల్లింపులు చేయగలుగుతారు. ఇప్పటికే ఫ్రాన్స్, సింగపూర్, యూఏఈ, మారిషస్, నేపాల్, భూటాన్, ఖతార్, శ్రీలంక, కంబోడియా వంటి దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు గ్రీస్ చేరడంతో మొత్తం 10 దేశాల్లో యూపీఐ సేవలు విస్తరించాయి. విదేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకులు, వ్యాపారవేత్తలకు ఈ విస్తరణ మరింత సౌకర్యాన్ని కల్పించనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!