

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ థియేటర్లలో ఘన విజయాన్ని నమోదు చేసింది. మే 21, 2026న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ.230 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి మరోసారి దృశ్యం ఫ్రాంచైజీ సత్తాను చాటింది. ఈ విజయంతో అభిమానుల్లో ‘దృశ్యం 4’పై కూడా ఆసక్తి పెరిగింది.
ఇక థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘దృశ్యం 3’ విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. జూన్ 18 లేదా జూన్ 25 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, దీనిపై చిత్రబృందం లేదా ఓటీటీ సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అభిమానులు అధికారిక అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!